Gold Prices Today : ఎంతెంత దూరం.. చాలా దగ్గర దూరం.. ధరలు దిగివస్తున్నాయిగా

ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొంత నేల చూపులు చూస్తున్నాయి

Update: 2024-06-01 04:39 GMT

బంగారం ధరలు తగ్గితే ఎంత ఆనందమో చెప్పలేం. కేవలం కొనుగోలుదారులే కాదు.. చూసే వారికి కూడా బంగారం ధరలు తగ్గితే అదొక రకమైన తృప్తి. ఆనందం. తాము ఇప్పటికిప్పుడు బంగారాన్ని కొనుగోలు చేయకపోయినా కొనుగోలు ఎప్పుడైనా చేస్తాం కదా? అన్న ఆలోచనతోనే ఆనందపడుతుంటారు. అందుకే ధరలు పెరిగినప్పుడు నిరాశ... తగ్గినప్పుడు ఆనందం అంతే స్థాయిలో కనిపిస్తుంటాయి. బంగారం, వెండి ధరలు గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టాయి.

తగ్గుతున్నాయంటే
?
అయితే బంగారం, వెండి ధరలు ఈ స్థాయిలో తగ్గుతున్నాయంటే.. ముందు ముందు భారీగా పెరిగే అవకాశముందని కూడా మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే తగ్గినప్పడే కొనుగోలు చేయాలని చెబుతున్నారు. సూచిస్తున్నారు. బంగారం ధరలు ఎప్పుడూ పెద్దగా తగ్గవు. అందులోనూ సీజన్ సమయాల్లో మరింత పెరిగే అవకాశముంటుంది. దిగుమతులు తక్కువగా ఉండటం, డిమాండ్ అధికంగా ఉండటంతో బంగారం, వెండి ధరలు ప్రియం కావడమే తప్ప తగ్గేది ఉండదని, అందుకే ఇప్పుడు కొనుగోళ్లకు మంచి సమయం అని చెబుతున్నారు.
నేటి ధరలు...
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొంత నేల చూపులు చూస్తున్నాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగరాం ధర 66,690 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం దర 72,750 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 99,900 రూపాయలుగా కొనసాగుతుంది.


Tags:    

Similar News