Gold Price Today : బంగారం ధర ఈరోజూ పెరిగిందిగా.. వెండి ధర మాత్రం?

ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి.

Update: 2024-08-04 03:10 GMT

బంగారం ఒకసారి పరుగు మొదలు పెట్టిందంటే ఇక ఆపదు. ఎందుకంటే అంతర్జాతీయంగా పసిడికి ఉన్న డిమాండ్ అలాంటిది. ఆధునిక ప్రపంచంలోనూ బంగారం కొనుగోళ్ల పట్ల ఎక్కువ మంది మొగ్గు చూపుతుండటమే ఇందుకు కారణం. ప్రజల కొనుగోలు శక్తి పెరగడం, సమాజంలో గౌరవ మర్యాదల మరింత పెంచుకోవడం కోసం బంగారాన్ని ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారన్నది వ్యాపార వర్గాల వాదన. డిజైన్లు మార్చి మరీ ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. మార్కెట్ లోకి కొత్త డిజైన్ వచ్చిందని తెలిస్తే చాలు దానిని కొనుగోలు చేసేంత వరకూ నిద్రపోని మహిళలు ఎంతోమంది ఉన్నారని అంటున్నారు.

అవసరానికి మించి...
అదే సమయంలో బంగారం ఒకప్పుడు అవసరమైనప్పుడు మాత్రమే కొనుగోలు చేసేవారు. అదీ శుభకార్యాలకు మాత్రమే కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. కుటుంబంలో ఏ చిన్న ఫంక్షన్ అయినా.. అది పుట్టిన రోజు అయినా.. పెళ్లి రోజు అయినా కానుకగా బంగారాన్నే ఎంచుకోవడం అలవాటుగా మార్చుకోవడంతో దాని డిమాండ్ అమాంతంగా పెరిగింది. బంగారం, వెండి తమ వద్ద ఎంత ఎక్కువగా ఉంటే అంత స్టేటస్ సింబల్ గానూ, భద్రతగానూ ఉంటుందని భావిస్తున్నారు. అందుకే అవసరానికి మించి కొనుగోళ్లు జరుగుతుండటంతో డిమాండ్ పెరిగి వాటి ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ధరలు నేడు...
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. శ్రావణమాసం ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ధరలు మరింత పెరిగే అవకాశముందని తెలియడంతో ఎక్కువ మంది ఆషాఢమాసంలోనే కొనుగోలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ తగ్గించిన తర్వాత పది గ్రాముల బంగారం ధరపై నాలుగువేల రూపాయలు తగ్గింది. ఆ తర్వాత మళ్లీ పెరగడం ప్రారంభించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 64,700 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 70,580 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర మాత్రం నిలకడగా కొనసాగుతూ 90,900 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News