Gold Prices Today : బంగారం ధరలు తగ్గాయి.. కానీ మూడు రోజుల నుంచి అంతేనా?

వరసగా మూడో రోజు కూడా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా అంతే

Update: 2024-03-13 02:51 GMT

బంగారం ధరలు అంతే. పెరిగితే ఎక్కువగానూ తగ్గితే తక్కువగా ధరలు ఉంటాయి. అంతర్జాతీయ ధరల్లో ఒడిదుడుకులను బట్టి బంగారం ధరల్లో మార్పులు, చేర్పులుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. దీనికి తోడు విదేశీ మాంద్యం, బంగారం దిగుమతులపై ఆంక్షలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, వివిధ దేశాల మధ్య యుద్ధాల ప్రభావం కూడా బంగారం ధరలపై పడే అవకాశముంటుంది. అందుకే బంగారం ధరలు ఎప్పుడూ స్థిరంగా కొనసాగవన్నది అందరికీ తెలసిందే.

సీజన్ వెళ్లినా...
పెళ్లిళ్ల సీజన్ మరి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. రానున్న కాలంలో పెళ్లిళ్లు జరగవు, శుభముహూర్తాలు లేవు, మూఢమి వస్తుండటంతో పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే ఇప్పుడు ధరలు పెరిగితే రానున్న కాలంలో పసిడి ధర పతనమవుతుందని అనేక మంది అంచనా వేసి కొనుగోలుకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ బంగారం ధరలు తగ్గినా అంత పెద్ద స్థాయిలో తగ్గవని చెబుతున్నారు. మరోవైపు కొనుగోళ్లు కూడా బాగా పెరగడంతో జ్యుయలరీ దుకాణాలు వినియోగదారులతో కిటకిట లాడుతూనే కనిపిస్తున్నాయి.
మూడో రోజు కూడా...
వరసగా మూడో రోజు కూడా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా అంతే. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు మాత్రమే తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,730 రూపాయల వరకూ నమోదయింది. 24 క్యారెట్ల బంగారం ధరలు 66,250 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది. కిలో వెండి ధర మాత్రం 79,600 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News