Gold Price Today : నవంబరు నెల మహిళలకు గుడ్ న్యూస్... బంగారం ధరలు దిగివస్తున్నాయా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది.

Update: 2024-11-26 03:15 GMT

బంగారం ధరలు చాలా వరకూ దిగివస్తున్నాయి. నవంబరు నెలలో పెరగాల్సిన బంగారం ధరలు క్రమంగా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చేటట్లు కనిపిస్తుంది. బంగారం కొనుగోళ్లు భారీగా పడిపోవడంతో ధరలు తగ్గడం మంచిదేనని వ్యాపారులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ తగ్గుదల ఎక్కువ కాలం ఉండదని, రానున్న కాలంలో బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని తెలిపారు. నాలుగు రోజుల క్రితం వరకూ వరసగా పెరిగిన బంగారం, వెండి ధరలు గత రెండు రోజుల నుంచి కొంత తగ్గుతూ వస్తున్నాయి. నిన్న ఒక్కరోజే పది గ్రాముల బంగారం ధరపై వెయ్యి రూపాయల వరకూ తగ్గడం వినియోగదారులకు సంతోషకరమైన వార్తగానే చెప్పాలి.

భారీగా తగ్గి...
బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయంటే అదే స్థాయిలో త్వరలోనే పెరుగుదల ఉంటుందన్నది మార్కెట్ నిపుణుల అంచనాగా వినిపిస్తుంది. అందుకే ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. జ్యుయలరీ దుకాణాలు కూడా అనేక ఆఫర్లతో ముందుకు రావడం కూడా వినియోగదారులకు కలసి వచ్చే అంశంగా చెబుతున్నారు. బంగారం, వెండి ధరలు ఎప్పుడూ నిలకడగా ఉండవు. నిత్యం ధరల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. అందుకే ఈరోజు ధరలు భారీగా తగ్గాయి కాబట్టి కొనుగోలు చేయడం మంచిదని, పెట్టుబడి పెట్టే వారికి కూడా మంగళవారం కొనుగోలుకు మంచి టైమ్ అని వ్యాపారులు చెబుతున్నారు.
మరింత ప్రియమవుతాయని...
పసిడి ధరలు మరింత ప్రియమవుతాయని భావించి కొందరు ముందుగానే కొనుగోలుకు ఇష్టపడుతున్నారు. అందుకే జ్యుయలరీ దుకాణాలు కూడా నిన్నటి నుంచి కొంత కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. అయితే మధ్యాహ్నానికి ధరలు పెరగొచ్చు. స్థిరంగా ఉండవచ్చు. తగ్గొచ్చు. ఉదయం ఆరు గంటల వరకూ ఉన్న ధరలను చూసి జ్యుయలరీ దుకాణాలకు వెళ్లవచ్చు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,990 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 78,540 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,00,500 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News