Gautam Adani: దేశంలోనే అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ
Gautam Adani: అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ తిరిగి ఆసియా కుబేరుడిగా మారిపోయారు. అమెరికా షార్ట్ సెల్లర్..
Gautam Adani: అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ తిరిగి ఆసియా కుబేరుడిగా మారిపోయారు. అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలపై సెబీ విచారణను మినహాయించి ప్రత్యేకమైన దర్యాప్తులేమీ అవసరంలేదంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదాయం సంపద వేగంగా పెరిగిపోయింది. ఇప్పుడు దేశంలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ప్రముఖ రిలయన్స్ ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి దేశంలో నెం.1 సంపన్నుడిగా నిలిచారు ఆదానీ. అయితే సుప్రీం కోర్టు నుంచి ఆదానీకి అనుకూలంగా తీర్పు రావడంతో ఆయన కంపెనీల షేర్లు వేగంగా పెరిగాయి. శుక్రవారం ఉదయం9.30 గంటలకు అదానీ సంపద 97.6 బిలియన్ డాలర్లకు చేరినట్లు బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. ఇదే సమయంలో ముకేశ్ అంబానీ ఆదాయం 97 బిలియన్ డాలర్ల వద్ద ఉంది. అటు ప్రపంచ సంపన్నుల లిస్టులో అదానీ 12, అంబానీ 13వ స్థానాల్లో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక టాప్ 10 జాబితాలో ఎవరెవరు ఉన్నారో చూద్దాం.
ఫోర్బ్స్ భారతీయ సంపన్నుల జాబితా:
- గౌతమ్ అదానీ
- ముఖేష్ అంబానీ
- శివ నాడార్
- సావిత్రి జిందాల్ మరియు కుటుంబం
- సైరస్ పూనావాలా
- దిలీప్ షాంఘ్వీ
- కుమార్ బిర్లా
- రాధాకిషన్ దమాని
- లక్ష్మీ మిట్టల్
- కుశాల్ పాల్ సింగ్