Gold Prices Today : వామ్మో ఇంత పెరగడటమా? ఇక తగ్గేట్లు లేదుగా? కొనడం కష‌్టమే
ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా మరింత ప్రియమయ్యాయి
బంగారం ధరలు మరింత ప్రియం కానున్నాయి. పెళ్లిళ్ల సీజన్ ముగియనున్న తరుణంలో తగ్గుతాయనుకున్న ధరలు పైకి ఎగబాకుతున్నాయి. పసిడి ధరలను పెరుగుతుండటం చూస్తే బంగారం కొందరి వస్తువుగానే మారనుంది. బంగారానికి ఉన్న డిమాండ్ అలాంటిది. బంగారం, వెండిని భారతీయ సంస్కృతిలో ఒక సంప్రదాయ వస్తువులుగా చూడటం ఎప్పటి నుంచో ఉంది. ఇటీవల కాలంలో అది స్టేటస్ సింబల్ గా మారింది. దీనికి తోడు బంగారం తోడుంటే ఆనందం మీ వెంటే అన్న నినాదంతో కొనుగోళ్లు మరింత పెరిగాయి.
కష్ట సమయాల్లో...
కరోనా వంటి క్లిష్ట సమయాల్లో బంగారం కొన్ని లక్షల కుటుంబాలను ఆదుకుంది. ఉపాధి అవకాశాలు కోల్పోయిన కుటుంబాలకు బంగారం నాడు ఆసరాగా నిలిచింది. అందుకే వీలయినప్పుడల్లా బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎవరూ వెనుకాడటం లేదు. పైగా ధరలు పెరిగినా పట్టించుకోవడం లేదు. అందుకే బంగారానికి, అదే సమయంలో వెండికి గిరాకీ తగ్గడం లేదు. అంతర్జాతీయంగా ధరల్లో ఒడిదుడుకులు, విదేశాల్లో నెలకొన్న మాంద్యం కారణంగా బంగారం ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి.
భారీగా పెరిగి...
ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. వినియోగదారులకు షాకిచ్చాయి. పది గ్రాముల బంగారం ధరపై 380 రూపాయలు పెరిగింది. వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి ధరపై మూడు వందలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,760 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67,310 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర ప్రస్తుతం 80,500 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.