Gold Prices Today : ఉగాదికి బంగారం ధరలు మరింత పెరుగుతాయా? నిపుణుల అంచనా ఇదే

బంగారం ధరలకు అదుపు లేకుండా పోతుంది. మార్కెట్ లో ఏ వస్తువుకు లేని డిమాండ్ బంగారానికి ఉంది

Update: 2024-04-08 03:22 GMT

బంగారం ధరలకు అదుపు లేకుండా పోతుంది. మార్కెట్ లో ఏ వస్తువుకు లేని డిమాండ్ బంగారానికి ఉంది. గత ఆరు నెలల్లో బంగారంపై పెట్టిన పెట్టుబడికి 25 శాతం రిటర్న్స్ వచ్చాయి. దీంతో మదుపరులు ఎక్కువగా బంగారం కొనుగోళ్లపైనే ఫోకస్ పెట్టారు. కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుండటంతో పాటు దిగుమతులు తగ్గడం కూడా పసిడి ధరలు మరింత ప్రియం అయ్యే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు తాజాగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

లక్షకు చేరువలో...
ఇప్పటికే పది గ్రాముల బంగారం డెబ్బయి వేల రూపాయలు దాటింది. కిలో వెండి ధర లక్ష రూపాయలకు చేరువలో ఉంది. ఇలా పెరుగుతూ పోతే ఇక బంగారం ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండటం కష్టమేనంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ ముగుస్తున్న సమయంలో మరింత ధరలు పెరిగే అవకాశముందని చెబుుతున్నారు. దీనికి అంతర్జాతీయ కారణాలను కూడా చూపుతున్నారు. విదేశాల్లో నెలకొన్న మాంద్యం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయంటున్నారు.
నేటి ధరలు...
ఉగాది పండగకు ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. పండగ రోజు కొనుగోళ్లు ఎక్కువగా ఉండే అవకాశముండటంతో ధరలు మరింత పెరిగే అవకాశముందని కూడా మార్కెట్ నిపుణులు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 65,340 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,280 రూపాయలు పలుకుతుంది. కిలో వెండి ధర ప్రస్తుతం 86,900 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News