Gold Prices : బంగారం ధరలకు బ్రేక్... వెండి ధరలు మాత్రం మరింత ప్రియం
ఈరోజు బంగారం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి.
బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి. డిమాండ్ తగ్గని వస్తువు ఏదైనా ఉందంటే అది బంగారం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. పసిడికి ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. ఇది ఫిక్స్. ఎందుకంటే మహిళలు ఎక్కువగా ఇష్టపడే వస్తువు కావడం ఒక కారణమయితే.. స్టేటస్ సింబల్ గా చూస్తుండటం మరొక కారణం. అందుకే బంగారాన్ని కొనడమంటే.. పొదుపు చేయడంగానే చూస్తారు. పెట్టుబడిగా భావించే వారు అనేక మంది పసిడిని నిత్యం సొంతం చేసుకునేందుకే తహతహలాడుతుంటారు.
అందుకే డిమాండ్...
బంగారం అంటే అంతే మరి. ప్రతి మహిళ మెడలో కేవలం అలంకార వస్తువుగానే కాదు... గౌరవప్రదమైన వస్తువుగా కనపడుతుంది. అందుకే బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎంతటి ధరైనా ఎవరూ వెనకాడరు. పేదల నుంచి ధనికుల వరకూ బంగారాన్ని కొనుగోలు చేయనిదే శుభకార్యాలను జరుపుకోరు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం ఎక్కువగా కనపడుతుంది. బాండ్ల స్థానంలో ఆభరణాలను కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తుంది.
వెండి ధరలు...
అయితే తాజాగా పసిడి ధరలకు కొంత బ్రేక్ పడ్డాయి. దేశ వ్యాప్తంగా ఈరోజు బంగారం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి. కిలో వెండి ధరపై మూడు వందల రూపాయల వరకూ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 58,550 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,870 రూపాయలు పలుకుతుంది. కిలో వెండి ధర మాత్రం ప్రస్తుతం 80,000 రూపాయలకు చేరుకుంది.