Gold Prices Today : ఎనభై వేలకు చేరువలో వెండి... అరవై ఏడు వేలకు దగ్గరగా బంగారం

ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అదే సమయంలో వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.

Update: 2024-03-26 03:04 GMT

బంగారం ధరలు మరింత ప్రియం అవుతాయన్న వార్తలతో కలత చెందుతున్న కొనుగోలుదారులకు కొంత ఊరటకల్గించే వార్త ఇది. బంగారం ధర స్వల్పంగా తగ్గింది. బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. విదేశీ మాంద్యం ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సహజంగా మార్చి నెలలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముంటుందని గత గణాంకాలు చెబుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో డిమాండ్ పెరగడం, తగినంత బంగారం నిల్వలు లేకపోవడం కూడా బంగారం ధరలు పెరగడానికి కారణంగా చెబుతారు.

డిమాండ్ కు తగినట్లు...
ఏ వస్తువు కైనా డిమాండ్ కు బట్టి ధరను నిర్ణయిస్తారు. డిమాండ్ తగ్గితే ధర తగ్గుతుంది. అలాడే సప్లయ్ ఎక్కువగా ఉన్నా కూడా ఆ వస్తువు ధర తగ్గుతుంది. సీజన్ లో కొన్ని వస్తువుల ధరలు పెరుగుతూ ఉంటాయి. కానీ బంగారానికి మాత్రం వీటన్నింటికీ మినహాయింపు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే సీజన్ తోనూ, డిమాండ్ తోనూ సంబంధం లేకుండా ధరలు పెరిగే వస్తువు బంగారం అని మాత్రం చెప్పక తప్పదు. అన్ సీజన్ లో కూడా ధరలు పెరుగుతుండటం మనం చూస్తామని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
వెండి మాత్రం...
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అదే సమయంలో వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,240 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,810 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 77,900 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News