Gold Prices Today : బంగారం ధరలపై మార్కెట్ నిపుణుల అంచనా ఇదే.. త్వరపడాల్సిందే
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొంత దిగివచ్చాయి
బంగారం ధరలు కొంత దిగివచ్చాయి. పైకిచూడకుండా నేల చూపులు చూస్తున్నాయి. బంగారం ధరలు నిన్న స్థిరంగా కొనసాగి నేడు తగ్గడం కొనుగోలు దారులకు శుభవార్త లాంటిదే. ఎందుకంటే పసిడి ప్రియులకు బంగారం ఎంత తగ్గిందన్నది ముఖ్యం కాదు... తాము కొనుగోలు చేసే సమయంలో ధరలు అందుబాటులో ఉంటే చాలునని భావిస్తారు. డిమాండ్ కు తగినట్లు బంగారం లేకపోవడంతోనే ధరలు పెరుగుతున్నాయన్న విశ్లేషణలు ఇప్పటి వరకూ వినిపించాయి.
వచ్చే నెలాఖరు నుంచి...
ఏప్రిల్ 28వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీ వరకూ ఎలాంటి ముహూర్తాలు లేవు. అంటే పెళ్లిళ్ల వంటి శుభకార్యాలు జరగవు. అందుకే బంగారం కొనుగోళ్లు మందగించే అవకాశముంది. అంటే బంగారం ధరలు మరింత తగ్గే అవకాశముందని భావిస్తున్నారు. మార్కెట్ నిపుణులు మాత్రం ఊహించిన స్థాయిలో బంగారం ధరలు తగ్గే అవకాశం లేదంటున్నారు. కేవలం కొనుగోళ్ల మీద బంగారం ధరలు ఆధారపడవని, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులను బట్టి ధరల పెరుగుదల్లో మార్పు ఉంటుందని చెబుతున్నారు.
స్వల్పంగా తగ్గి...
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొంత దిగివచ్చాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,240 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,810 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 80,400 రూపాయలుగా ఉంది.