Gold Rates Today : పసిడి అంటే అంతే మరి.. ఒకరోజు తగ్గి మరొకరోజు పెరుగుతూ

ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొంచెం తగ్గాయి

Update: 2024-03-16 03:54 GMT

పసిడి ధరలు పెరుగుతుంటాయి. తగ్గుతుంటాయి. ప్రతి రోజూ బంగారం ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్న ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, విదేశాలలో నెలకొన్న మాంద్యం వంటి కారణాలతో బంగారం ధరల్లో ప్రతి రోజూ మార్పు చోటు చేసుకుంటుంది. ఇటీవల బంగారం ధరలు భారీగా పెరిగాయి. కానీ కొద్ది రోజుల నుంచి స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. బంగారం ధరలతో సంబంధం లేకుండా కొనుగోళ్లు జరుగుతుండటంతో జ్యుయలరీ దుకణాలు కిటకిటలాడుతూనే ఉన్నాయి.

సీజన్ తో సంబంధం లేకుండా...
బంగారం ఎప్పుడూ అంతే. సీజన్ లేకుండా డిమాండ్ ఉన్న ఒకే ఒక వస్తువు బంగారం అని చెప్పుకోవచ్చు. తమవద్ద ఉన్న కొద్దిపాటి నగదుతో కూడా బంగారాన్ని ఎంతో కొంత సొంతం చేసుకోవచ్చు. అందుకే మదుపరులు ఎక్కువగా బంగారంపై పెట్టుబడులు పెడుతుంటారు. ధరలు భారీగా పెరిగినప్పుడు వాటిని విక్రయించి సొమ్ము చేసుకుని లబ్దిపొందుతుంటారు. అందుకే బంగారానికి వన్నె తగ్గనట్లుగానే డిమాండ్ కూడా తగ్గదు. ఎవర్ గ్రీన్ గా ఎప్పుడూ మెరుస్తూనే ఉంటుంది. దాని ధరలు కూడా అంతే.
కొద్దిగా తగ్గి...
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొంచెం తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,590 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,100 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది. కిలో వెండి ధర 79,900 రూపాయలుగా ఉంది.



Tags:    

Similar News