Gold Prices Today : వావ్.. బంగారం ధరలు దిగి వస్తున్నాయంటే.. శుభవార్త కాక మరేంటి?
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొద్దిగా తగ్గాయి
బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలకు కొద్దిగా బ్రేకులు పడుతున్నాయి. అనుకున్నంత స్థాయిలో ధరలు పెరగకపోవడం ఒకింత ఊరట కలిగించే అంశమే. మొన్నటి వరకూ ఎవరికీ అందనంతగా పసిడి ధరలు పెరగడంతో కొనుగోలు చేయడానికి కూడా జ్యుయలరీ దుకాణాలకు వచ్చేందుకు కొనుగోలుదారులు భయపడిపోయే పరిస్థితి నెలకొంది. వరసగా ధరలు పెరుగుతుండటమే కానీ, తగ్గడమనేది జరగకపోవడంతో కొనుగోలుదారుల్లో కూడా నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి.
మదుపు చేయాలని..
బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేయడం ఇప్పుడు స్టేటస్ సింబల్ గా మారిపోయింది. బంగారం మన వద్ద ఉంటే భవిష‌్యత్ కు భద్రత ఉంటుందన్నకారణంతో వాటిని కొనుగోలు చేసే వారు అధికంగా ఉన్నారు. మరికొందరు పెట్టుబడిగా చూస్తూ పసిడి, వెండి ఎంత ఎక్కువ కొనుగోలు చేస్తే అది మంచి మదుపు చేయడానికి దోహదపడుతుందని భావించారు. ప్రస్తుతం మూఢమి నడుస్తుండం, మరో మూడు నెలల వరకూ ముహూర్తాలు లేకపోవడంతో బంగారం ధరలు దిగి వస్తాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
నేటి ధరలు...
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధర పై వందరూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67,240 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,350 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 86,900 రూపాయలకు చేరింది.