Gold Price Today : నేటి బంగారం ధరలు చూస్తే బిత్తరపోవాల్సిందే
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొంత తగ్గుముఖం పట్టాయి.
బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని భావిస్తున్నారు. త్వరలో అక్షర తృతీయ ఉండటంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందన్నది మార్కెట్ నిపుణుల హెచ్చరిక. అందుకే ముందుగానే కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వారు చేస్తున్నారు. బంగారం, వెండి ధరలకు ఎప్పుడూ గిరాకీ తగ్గదు. ముహూర్తాలు లేకున్నా సరే.. కొనుగోళ్లు మాత్రం ఆగవు. అందుకు కారణం బంగారాన్ని కొనుగోలు చేసే వారు ఎక్కువగా తమ అవసరాల కోసం కొనుగోలు చేసే వారే ఎక్కువగా ఉండటం వల్లనే డిమాండ్ తగ్గడం లేదన్నది వ్యాపారుల మాట.
మూఢమి వచ్చినా...
మూఢమి ప్రవేశించింది. మరో మూడు నెలలు మంచి ముహూర్తాలు లేకపోయినా బంగారం దుకాణాలు మాత్రం కళకళలాడుతూనే ఉన్నాయి. ఇందుకు తగినట్లుగా జ్యుయలరీ దుకాణాలకు కొనుగోలుదారులను రప్పించేందుకు అనేక రకాల కొత్త డిజైన్లతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. బంగారం, వెండి వంటి వస్తువులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. డిమాండ్ కు తగినట్లు దిగుమతులు లేకపోవడం వల్లనే ధరలు పెరుగుతున్నాయన్నది అందరినోట వినిపిస్తున్న మాట.
స్వల్పంగా తగ్గి...
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై ఐదు రూపాయలు తగ్గింది. వెండి ధరలు కూడా కొంత తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,540 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 72.590 నమోదయినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఇక కిలో వెండి ధరలో కూడా స్వల్పంగా మార్పు కనిపించింది కిలో వెండి ధర 83,400 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.