Gold Prices Today : బంగారం దిగి వస్తుందోచ్... కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలలో కూడా తగ్గుదల కనిపించింది
బంగారం ధరలు గత కొద్ది రోజులుగా కిందకు దిగి వస్తున్నాయి. నేల చూపులు చూస్తున్నాయి. వెండి ధరలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. మూఢమి ప్రారంభమయిన నాటి నుంచి బంగారం, వెండి ధరలు కొంత దిగివస్తున్నట్లే కనిపిస్తున్నాయి. అయితే ఇందుకు కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి మారకం విలువ, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటి కారణాలతో బంగారం ధరల్లో ప్రతి రోజూ మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి.
తగ్గాయని అనుకునే లోపు...
బంగారం ధరలు దిగి వచ్చాయని సంబరపడవద్దని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దిగివస్తున్నాయంటే భారీగా పెరుగుతాయనడానికి సంకేతాలుగా పరిగణించాలని చెబుతున్నారు. అందుకే ఇప్పుడే బంగారం, వెండి వంటి వస్తువులను కొనుగోలు చేయడానికి మంచి సమయమని సూచిస్తున్నారు. ఇంతకు మించి ధరలు పెద్దగా దిగి రావన్నది కూడా నిపుణుల అభిప్రాయంగా ఉంది. ఒక్కసారిగా పెరిగాయంటే అంచనాలకు అందకుండా ధరలు పెరుగుతాయని కూడా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఈరోజు ధరలు ...
ీఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలలో కూడా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 65,840 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,820 రూపాయలు పలుకుతుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. కిలో వెండి ధర 86,400 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.