Gold Rates Today : బంగారం కొనేవారికి గుడ్ న్యూస్.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కాస్త నెమ్మదించాయి.

Update: 2024-05-18 02:10 GMT

బంగారం ధరలు పెరగడం మామూలే. తగ్గడం అరుదుగా జరిగే విషయం. ఎక్కువగా ధరలు పెరగడమో.. స్థిరంగా ఉండటమో జరుగుతుంది. బంగారం, వెండి ధరలకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. దానికి డిమాండ్ పడిపోయే పరిస్థితి ఇప్పుడు ఉండదు. భవిష్యత్ లో కూడా ఉండదు. ఎందుకంటే బంగారాన్ని కొనుగోలు చేసే వారు ఎక్కువవుతారుతప్పించి ఇక ఆ సంఖ్య తగ్గే అవకాశం ఉండదు. దానికి కారణం ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుండటం కూడా బంగారం, వెండి కొనుగోళ్లు పెరగడానికి ప్రధాన కారణంగా చూడాలి.

కారణాలివే...
అయితే ధరలు పెరగడం కూడా అంతే. అనేక కారణాలతో రోజూ ధరలు పెరుగుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, దిగుమతులను తగ్గించడం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతుంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారానికి ఉన్న డిమాండ్ ను బట్టి రానున్న కాలంలో ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు ఎప్పటికప్పుడు వినపిస్తూనే ఉన్నాయి. సీజన్ తో సంబంధం లేకుండా జరిగే వ్యాపారం ఇదే కావడంతో వీటి ధరలను నియంత్రించడం ఎవరి చేతుల్లోనూ ఉండదు.
స్వల్పంగా తగ్గి...
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కాస్త నెమ్మదించాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67,590 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,740 రూపాయల వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర మాత్రం 92,400 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News