Gold Prices Today : బంగారం తగ్గింది.. వెండి పెరిగింది.. అదీ లేటెస్ట్ రిపోర్ట్
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి
బంగారం ధరలలో ప్రతి రోజూ మార్పులు చోటు చేసుకుంటాయి. అనేక కారణాలతో ధరల్లో మార్పు కనపడుతుంది. అయితే పసిడి ధర ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. అందుకే ధరల విషయంలో కొనుగోలు దారులు పెద్దగా ఆలోచించడం మానేశారు. ఒకప్పుడు డబ్బులుంటే పసిడి కొనుగోలు చేసేవారు.. ఇప్పుడు అవసరమైతే తప్ప కొనుగోలు చేయడం లేదు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఇంత ధరలు పెట్టి బంగారాన్ని కొనుగోలు చేయడం అవసరమా? అన్న భావన ఎక్కువగా కనపడుతుంది.
భవిష్యత్ లో మరింతగా...
పెళ్లిళ్లలో కూడా గిల్టు ఆభరణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ బంగారం జోలికి కొందరు పోవడం లేదు. మరికొందరు మాత్రం బంగారం కొనుగోలు చేస్తే భవిష్యత్ బాగుంటుందని కొనేస్తున్నారు. అందులోనూ పెళ్లిళ్ల సీజన్ ఈ నెల 28వ తేదీ తో ముగియనుంది. మరో మూడు నెలల వరకూ ముహూర్తాలు లేకపోవడంతో ధరలు తగ్గే అవకాశముందని కూడా కొందరు పసిడి కొనుగోలుకు దూరంగా ఉంటున్నారు. అయితే ఈ ఏడాది బంగారం ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
నేటి ధరలు...
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,340 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 69,100 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 82,100 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.