Gold Prices Today : అవును.. ఈరోజుల్లో తగ్గడమంటే రిలీఫ్ కాక మరేంటి?
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపిస్తుంది
బంగారం ధరలు ఒకరోజు పెరుగుతుండటం, మరొక రోజు తగ్గడం సాధారణమే. పసిడి ధరలు ఎప్పుడూ అందుబాటులో ఉండవు. అది అందరికీ తెలిసిన విషయమే. ఏడాదికేడాది ధరల్లో పెరుగుదల భారీ మార్పు కనిపిస్తుంటుంది. రోజు వారి పెరుగుదల, తగ్గుదల మనకు పెద్దగా కనిపించకపోయినా ఏడాదిలో ఆ వ్యత్యాసం వేలల్లోనే ఉంటుంది. క్రితం ఏడాదికి ఈ ఏడాదికి కనీసం రెండు నుంచి మూడు వేల రూపాయల తేడా ఉంటుంది. అంటే పెరుగుదలే ఎక్కువగా కనిపిస్తుంది.
డిమాండ్‌కు తగినట్లు...
బంగారం డిమాండ్‌కు తగినట్లు లేకపోవడంతోనే ధరలు పెరుగుదల ఉందన్నది వాస్తవం. అందుకే పెట్టుబడిగా చూసే వారు ఎవరూ బంగారం కొనామన్న గిల్టీ ఫీల్ కారు. ఎందుకంటే ధరలు ఎప్పటికీ పడిపోవు. తాము కొనుగోలు చేసినప్పటి ధర కంటే ఎక్కువగానే ధరకు అది అమ్ముడుపోతుండటంతో బంగారాన్ని పెట్టుబడిగానే ఎక్కువమంది చూస్తారు. మదుపు చేయడానికి ఇది ప్రధాన మైన వస్తువుగా భావిస్తారు. భూమి మీద ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెట్టాల్సి రావడంతో బంగారాన్ని ఇందుకు ఎంచుకున్నారు.
స్వల్పంగా తగ్గినా...
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపిస్తుంది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు మాత్రమే తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు వరకూ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,190 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,390 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది. కిలో వెండి ధర 77,900 రూపాయలుగా కొనసాగుతుంది.