Gold Prices Today : ఆహా.. ఏమి ధర .. కొనరా.. క్యూ కట్టి
ఈరోజు దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొద్దిగా తగ్గుముఖం పట్టాయి.
బంగారం ధరలు ఊరిస్తున్నాయి. రారమ్మని పిలుస్తున్నాయి. కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం అని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. బంగారం అంటేనే ఎక్కువమంది మక్కువ చూపుతారు. ముఖ్యంగా మహిళలు అత్యంత ఇష్టపడే వస్తువు ఏదైనా ఉందంటే అది బంగారం, వెండి మాత్రమే. ఆభరణాలను కొనుగోలు చేయడంలో మహిళలు సీజన్ తో సంబంధం లేకుండా కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకోవడంతో బంగారం, వెండి వస్తువులకు డిమాండ్ ఎప్పుడూ తగ్గడం లేదు. దక్షిణ భారత దేశంలోనే ఎక్కువగా బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయని వ్యాపారులు కూడా చెబుతారు.
శ్రావణమాసానికి ముందే...
ఇక శ్రావణమాసం రావడానికి పెద్దగా సమయం లేదు. మరో రెండు వారాల తర్వాత శ్రావణ మాసం ప్రారంభమయిందంటే చాలు.. మంచి ముహూర్తాలు వచ్చేస్తాయి. పెళ్లిళ్లు, గృహప్రవేశాల వంటి శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి. తమిళనాడులో ఆషాఢం మాసంలోనూ పెళ్లిళ్లు జరుగుతుండటంతో ఆ ప్రాంతంలో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే ఆంధ్ర, కర్ణాటక, కేరళ వంటి ప్రాంతాల్లో వచ్చే నెల నుంచి అసలు సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ధరలు మరింత పెరిగే అవకాశముందన్న సంకేతాలను మార్కెట్ నిపుణులు ఇస్తున్నారు. ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని చెబుతున్నారు.
స్వల్పంగా తగ్గినా...
ఈరోజు దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల బంగారం ధరపై 110 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై 120 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై నాలుగు వందల రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67,490 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,630 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 99,600 రూపాయలుగా ఉంది.