Gold Prices Today : దిగి వస్తున్న పసిడి ధరలు.. ప్రియంగా మారుతున్న వెండి

ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి.

Update: 2024-02-16 03:23 GMT

బంగారం ధరలు వరసగా తగ్గుతున్నాయి. వెండి ధరలు మాత్రం పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ లో బంగారం ధరలు దిగి వస్తుండటం పసిడిప్రియులకు ఊరటకల్గించే అంశమే. గత నాలుగు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి. అయితే పెద్ద మొత్తంలో తగ్గడం లేదు. పది గ్రాములపై కేవలం పది రూపాయలు మాత్రమే తగ్గుతూ వస్తుంది. అయితే ఎంత తగ్గినా ఒక్కటేనని భావించే వారు కోకొల్లలు. ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసే వారికి ఇది గ్రేట్ రిలీఫ్ అని చెప్పాలి.

అనేక కారణాలు...
అంతర్జాతీయ మార్కెట్ లో పెరుగుతున్న ధరల ఒడిదుడకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. బంగారాన్ని పెట్టుబడిగా చూసేవారి కోసం ప్రస్తుతం సరైన సమయం అని మార్కెట్ నిపుణులు కూడా చెబుతున్నారు. జ్యుయలరీ దుకాణాలు కూడా పెద్దయెత్తున కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తుండటంతో గిరాకీ పెరగడానికి కారణంగా చెప్పాలి.
వెండి మాత్రం...
ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర 56,890 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,060 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర పై వంద రూపాయలు తగ్గడంతో ప్రస్తుతం మార్కెట్ లో కిలో వెంి ధర 76,100 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News