Gold Prices : హమ్మయ్య దిగివచ్చింది.. ఈరోజు ఇక కొనేయొచ్చు

పెళ్లిళ్లు జరుగుతున్న సమయంలో బంగారం ధరలు కొంత దిగి వచ్చాయి. వెండి ధరలు కూడా తగ్గాయి

Update: 2023-11-01 02:37 GMT

పెళ్లిళ్లు జరుగుతున్న సమయంలో బంగారం ధరలు కొంత దిగి వచ్చాయి. గత కొద్ది రోజులుగా భయపెడుతున్న బంగారం ధరలు ఈరోజు కొంత శాంతించాయి. ధరలు పెరుగుదల అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి మారకం విలువ వంటి కారణాలతో హెచ్చు తగ్గులుంటాయంటారు మార్కెట్ నిపుణులు. అయితే వేరే కోణంలో మాత్రం బంగారం కొనుగోళ్లు ధరలు భారీగా పెరగడంతో భారీగా పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు.

కొనుగోళ్లు తగ్గడంతో...
బంగారం కొనుగోళ్లు తగ్గిపోవడంతో ధరలు తగ్గించక తప్పలేదు. అంత మొత్తం వెచ్చించి బంగారం కొనుగోలు చేయలేక అనేక మంది ఈ వి‍షయంలో వెనకడుగు వేస్తున్నారు. పెళ్లిళ్లకు కానుకల రూపంలో ఇచ్చే బంగారాన్ని నగదు రూపంలోనైనా ఇచ్చేందుకు సిద్ధపడటంతోనే ఇటీవల బంగారం కొనుగోళ్లు బాగా తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. అందుకే వినియోగదారులు లేక జ్యుయలరీ దుకణాలు వెలవెలపోతున్నాయి. అయితే రానున్న దీపావళికి ధరలు మరింత పెరుగుతాయని, కొనుగోలు చేయదలచుకున్న వారు ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఈరోజు ధరలు...
ఈరోజు బంగారం ధరలు దేశంలో భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల బంగారం ధరపై ఐదు వందల రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై మూడు వందల రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,700 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,850 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 78,200 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News