Gold Prices : జనవరి నెలలో ఇంత చల్లని కబురు ముందెన్నడూ వినలేదే?
దేశంలో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై మూడు వందల ముప్పయి రూపాయలు తగ్గింది. వెండి ధర కూడా తగ్గింది.
బంగారం ధరలు ఎప్పుడూ ప్రియంగానే ఉంటాయి. అవి ఎప్పుడూ సంపద ఉన్న వారికే సొంతమవుతాయన్న భావన ఉంది. ఎందుకంటే గతంతో పోలిస్తే బంగారం ధరలు మామూలుగా పెరగలేదు. పదేళ్ల కాలంలో దాదాపు ముప్పయివేల రూపాయల మేరకు పది గ్రాముల వరకూ పెరిగింది. అయినా కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. గిరాకీ తగ్గనంత వరకూ బంగారం ధరలు కూడా తగ్గవు. అది అందరికీ తెలిసిన విషయమే అయినా పసిడి కోసం తహతహలాడుతుంటారు. దానిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.
పెట్టుబడికి తగిన రాబడి...
పెరుగుతున్న ధరలు కొనుగోలుదారులను ఇబ్బంది పెడుతున్నాయి. అయినా అవసరాల కోసం తప్పడం లేదు. శుభకార్యాలకు బంగారాన్ని కొనుగోలు చేయాల్సి వస్తుంది. అయితే గతంలో కంటే ఇప్పుడు ధరలు ఎక్కువగా పెరగడంతో తమకు అవసరమైనంత మేరకే కొనుగోలు చేస్తున్నారు. పెట్టుబడిగా చూసే వారు కూడా బంగారం ధరలను చూసి కొంత భయపడుతున్నారు. ఇంత మొత్తం బంగారం పెడితే దానికి తగిన రాబడి భవిష్యత్ లో వస్తుందా? రాదా? అన్న సందేహం కూడా వారిని వెంటాడుతుంది.
బంగారం, వెండి...
అయితే దేశంలో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై మూడు వందల ముప్పయి రూపాయలు తగ్గింది. వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి ధరపై నాలుగు వందల రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,400 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,620 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 77,000 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.