Gold Prices : పసిడి పతనం ప్రారంభమయిందా? ఇలా జరిగితే ఆనందమే కదా?

బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై నాలుగు వందల రూపాయల వరకూ తగ్గింది. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి

Update: 2024-01-05 04:11 GMT

Gold Prices:పసిడి ప్రియులకు ఒకరకంగా శుభవార్త అని చెప్పాలి. గతంలో ఎన్నడూ తగ్గనంతగా ధరలు తగ్గుతున్నాయి. వరసగా రెండు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతుండటం కొంత ఊరటనిచ్చే అంశంగానే భావించాలి. భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడినట్లయింది. కొనుగోళ్లు మందగించడంతో పాటు అనేక కారణాలతో బంగారం ధరలు దిగివస్తున్నాయనే చెప్పాలి. అందునా శుభకార్యాలు జరుగుతుండటంతో ఈ తరుణంలో ధరలు తగ్గడం అంటే సంతోషించదగ్గ విషయంగానే చూడాలి.

ఎప్పుడూ పెరగడమేనా?
బంగారం ధరలలో నిత్యం పెరుగుదలే కనిపిస్తుంటుంది. తగ్గుదల అరుదుగానే చోటు చేసుకుంటుంది. అయితే గత రెండు రోజులుగా ధరలు తగ్గుతుండటంతో హ్యాపీ ఫీలవుతున్నారు. ధరలు తగ్గిన తర్వాత కొనుగోలు దారులు జ్యుయలరీ షాపులకు క్యూ కట్టే అవకాశముందని వ్యాపారులు కూడా అంచనా వేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కూడా ఉండటంతో ఇక కొనుగోళ్లు ఊపందుకుంటాయని భావిస్తుంటారు. బంగారంతో పాటు వెండి కూడా తగ్గుముఖం పట్టడం ఆనందదాయకమే.
భారీగా వెండి ధరలు...
దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై నాలుగు వందల రూపాయల వరకూ తగ్గింది. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కిలో వెండి ధరపై 2,300 రూపాయలు తగ్గడం విశేషం. ఈ ధరలు నిన్నటివే అయినా.. నేడు స్థిరంగా కొనసాగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 58,100 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,380 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర బాగా తగ్గి ప్రస్తుతం మార్కెట్ లో 76,600 రూపాయలకు చేరుకుంది.



Tags:    

Similar News