Gold Prices : బడ్జెట్ కు ముందు భారీగా పెరిగిన బంగారం ధరలు

ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అదే బాటలో కొనసాగుతున్నాయి

Update: 2024-01-31 03:23 GMT

రేపు బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న తరుణంలో వరసగా రెండు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. పసిడి ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణుల హెచ్చరికలు నిజం అయ్యేలా కనిపిస్తున్నాయి. బడ్జెట్ ప్రకటించిన తర్వాత ధరలు తగ్గినా ఇప్పుడు పెరిగితే తర్వాత కొంత తగ్గినా ఇబ్బంది వ్యాపారులకు ఉండదు. కానీ ఆర్థికంగా నష్టపోయేది మాత్రం కొనుగోలుదారులే. అందుకే బంగారం ధరలు ప్రతి రోజూ పెరుగుతున్నాయి.

కొనుగోళ్లు కూడా...
పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. పసిడి ధరలు ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని కొనుగోలు చేసే వారు చాలా మంది ఉంటారు. పెట్టుబడిగా చూసేవారు బంగారాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తుంటారు. అందుకే బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ధరల పెరుగుదల ఇప్పట్లో ఆగేది కాదు. ఇంకా పెరుగుతూనే ఉండే అవకాశముంది. అందుకే ముందుగా కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి.
భారీగా పెరిగిన...
ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అదే బాటలో కొనసాగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధరపై రెండు వందల రూపాయలు పెరిగింది. కిలో వెండి ధర మూడు వందల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 58,000 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,270 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 78,000 రూపాయలుగా కొనసాగుతుంది.


Tags:    

Similar News