Gold Prices Today : చూశారుగా.. ఎంత ధర పెరిగిందో.. అందుకే తగ్గినప్పుడే కొనాలనేది
ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి.
బంగారం ధరలు అంతే.. పది రూపాయలు తగ్గితే ఆనంద పడి పోనక్కర్లేదు. వందల రూపాయల మేరకు ధరలు పెరుగుతాయి. అది బంగారం విషయంలోనే చూస్తాం. రియల్ ఎస్టేట్ లో భూముల ధరలు పడిపోతే భారీగా పడిపోతాయి. పెరిగినా అంతే. కానీ స్వల్పంగా పెరగవు. తగ్గవు. కానీ బంగారంలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతుంది. తగ్గితే తక్కువగా, పెరిగితే భారీగా పెరగడం బంగారానికి అలవాటు. అందుకే తగ్గిందని బంగారం కొనుగోలు చేసే వారు ఎవరూ పండగ చేసుకోరు.
పెరిగాయని...
బంగారం ధరలు పెరిగాయని అలా చూస్తూ ఊరుకోరు. తమవద్ద ఏమాత్రం డబ్బులున్నా కొనుగోలు చేయడానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. దాని కారణం అది మదుపుగా భావిస్తారు. మరికొందరు స్టేటస్ సింబల్ గా అనుకుంటారు. ఇంకొందరు పెట్టుబడిగా చూస్తుంటారు. అనేక మంది అవసరాల కోసం కొనుగోలు చేస్తారు. ఇన్ని రకాలుగా బంగారం కొనుగోలు చేస్తుంటారు కనుకే దానికి డిమాండ్ ఎప్పుడూ పడిపోదు. పెరిగితే మాత్రం అంతే వేగంగా తగ్గదు అన్నది మాత్రం ఖచ్చితమే.
తగ్గిన వెండి...
ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై రెండు వందల రూపాయలు పెరిగింది. కిలో బంగారం ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,360 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,940 రూపాయలు పలుకుతుంది. కిలో వెండి ధర 80,100 రూపాయలుగా నమోదయింది.