Gold Prices Today : లక్షకు చేరువలో వెండి ధరలు.. బంగారం ధరలు మరింత ప్రియం
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా మరింతగా పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి
బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వాటికి అడ్డుకట్ట వేయడం ఎవరి తరమూ కావడం లేదు. రోజురోజుకూ పసిడి, వెండి ధరలు పెరుగుతుండటం వినియోగదారులకు షాక్ కలిగిస్తున్నాయి. బంగారం ధరలు పెరగడం అంటూ ప్రారంభిస్తే ఇక ఆగవన్నది అందిరికీ తెలిసిందే. గత కొద్ది రోజులుగా స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు పరుగును అందుకోవడంతో ఎంత వరకూ ఈ ధరలు వెళతాయన్నది అర్థం కాకుండా ఉంది. బంగారం, పసిడి ధరలు పెరగడానికి అనేక కారాణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు ప్రధాన కారణంగా చెబుతున్నారు.
లక్షకు చేరువలో...
పది గ్రాముల బంగారం ధర 80 వేల రూపాయలకు చేరుకోవడానికి ఇంకా పెద్ద సమయం ఉండదంటున్నారు. కిలో వెండి ధర లక్షకు చేరువలో ఉంది. రానున్నది సీజన్ కావడం, ముహూర్తాలు మళ్లీ ప్రారంభం కానుండటంతో బంగారం ధరలకు రెక్కలు వస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కొనుగోలు చేయాలనుకున్న వారు ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. ధరల నియంత్రణ ఎవరి చేతుల్లోనూ ఉండదని, పెట్టుబడి పెట్టేవారు బంగారం కొనుగోలు చేయాలంటే ఇదే మంచి సమయమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
వెండి ధరలు..
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా మరింతగా పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. వరసగా ధరలు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,160 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,450 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 97,200 రూపాయలుగా కొనసాగుతుంది.