Gold Prices Today : వెయిట్ చేద్దామనుకుంటే... జేబులు ఖాళీ అవుతాయమ్మా.. ఇదే కొనుగోలుకు సమయం
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి
బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. గత కొంత కాలంగా భారీ తగ్గుదల కనిపించింది. ప్రధానంగా కేంద్ర బడ్జెట్ లో బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం తగ్గించడంతోనే ధరలు తగ్గాయి. అయితే ధరలు తగ్గాయని సంబరపడే లోగా మళ్లీ పెరుగుదల కనిపిస్తుంది. బంగారం ధరలు ఎప్పుడూ భారీగా తగ్గవు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా బంగారం, వెండికి ఉన్న డిమాండ్ అలాంటిది. కొనుగోలు చేసే వారు ఎక్కువ. బంగారం, వెండి తగినంత అందుబాటులో లేకపోవడంతో ధరలు ఆటోమేటిక్ గా పెరుగుతాయి. రానున్న కాలంలో ధరలు మరింత ప్రియమవుతాయని మార్కెట్ నిపుణులు చేస్తున్న హెచ్చరికలు నిజం అయ్యేటట్లు కనిపిస్తున్నాయి.
అనేక కారణాలు....
బంగారం అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అంతర్జాతీయ ధరలలో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, బంగారం నిల్వలు తగినంత లేకపోవడంతో ధరల పెరిగిపోతున్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు రానున్నది శ్రావణమాసం కావడంతో ధరలు మరింత పెరిగే అవకాశముంది. శుభకార్యాలకు బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడం అలవాటుగా మారడంతో కొనుగోళ్లు విపరీతంగా పెరుగుతాయి. పెళ్లిళ్లకు బంగారం లేనిదే పని జరగదు. అందుకే వచ్చే నెల నుంచి ధరలు మరింత ప్రియమవుతాయని అందరూ చెబుతున్నారు.
ధరలు పెరిగాయ్...
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. పెరగడం ప్రారంభించడంతో ఇక ఆగడం కష్టమేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ధరలు పెరగకముందే కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 64,010 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 69,830 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 91,100 రూపాయలకు చేరుకుంది. రానున్న కాలంలో ధరలు మరింత పెరిగే అవకాశముందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.