Gold Prices Today : బంగారం ధరలు మళ్లీ పెరిగాయిగా.. ఇక ఆగుతాయంటారా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలలో కూడా అదే సమయంలో పెరుగుదల కనిపించింది.

Update: 2024-05-16 04:01 GMT

బంగారం ధరలు ఎప్పుడూ కిందకు చూడవు. ఒకవైపు నేల చూపులు చూసినా అది తాత్కాలికమే. బంగారానికి తెలిసినంతగా పెరగడం మరే వస్తువుకు ధరల విషయంలో తెలియదు. ఎందుకంటే రోజు వారీ మార్పులలో పెరగడమే తప్ప తగ్గడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు కొంత దిగి వస్తున్నాయని అనుకున్నారు. పది గ్రాములకు పది రూపాయలు. కిలో వెండి ధరపై వంద రూపాయల చొప్పున తగ్గుతూ వస్తుంది. దీనికే ఆనందపడిపోయి వినియోగదారులు కొనుగోలు చేస్తుంటారు.

విలువైన వస్తువు...
బంగారం విలువైన వస్తువుగా మారింది. గతంలో అలంకారానికి మాత్రమే ఉపయోగించే బంగారం నేడు పెట్టుబడికి చిరునామాగా కూడా మారడంతో దానికి ఎప్పటికప్పుడు డిమాండ్ పెరుగుతుంది. అందుకే ధరలు పెరుగుతుంటాయి. ధరలను అదుపు చేయడం అనేది ఎవరి చేతుల్లోనూ ఉండదు. అందులోనూ భారతీయులు ఎక్కువగా బంగారం, వెండి వస్తువుల కొనుగోలు పై మక్కువ చూపుతుండటంతో ధరలు ఇక మరింత పెరిగే అవకాశాలే ఉన్నాయి తప్పించి తగ్గవన్నది అందరికీ తెలిసిందే.
ధరలు నేడు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలలో కూడా అదే సమయంలో పెరుగుదల కనిపించింది. బంగారం, వెండి ధరలు పెరిగాయంటే అది భారీగానే ఉంటుందని అందరికీ తెలిసిందే. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67,265 రూపాయలుకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,380 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర మాత్రం 91,100 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News