Gold Prices Today : పెరిగిందని బాధపడకండి.. అంతగా భారం కాలేదని సంతోషించండి

ఈరోజు బంగారం ధరలు దేశంలో పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది

Update: 2024-02-22 04:22 GMT

బంగారం అంటే అందరికీ ఇష్టమే. దానిని కొనుగోలు చేయాలని ఎవరికి ఉండదు. ముఖ్యంగా మహిళలు బంగారాన్ని సొంతం చేసుకోవాలని కలలు కంటుంటారు. ఎంత ఎక్కువ బంగారం ఉంటే అంత గౌరవం సమాజంలో లభిస్తుందని భావిస్తారు. వెండి కూడా అంతే. బంగారం, వెండి రెండూ స్టేటస్ సింబల్స్ గానే చూస్తారు. అందుకే ఈ రెండింటీకీ గిరాకీ ఎప్పటికీ తగ్గదు. తగ్గబోదు. ధరలు కూడా తగ్గవు. తగ్గినా స్వల్పమే. పెరుగుతూనే ఉంటాయి. అవి ఎంత వరకూ వెళతాయన్నది ఎవరూ చెప్పలేని పరిస్థితి.

డిమాండ్ అధికంగానే...
అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంద్యం వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. పైగా మూడు నెలల పాటు పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింత పెరిగే అవాకాశముందన్న హెచ్చరికలు ఎటూ వినపడుతూనే ఉన్నాయి. అందుకే బంగారాన్ని తగ్గినప్పుడే కొనుగోలు చేయడం మంచిదంటారు. పెళ్ళిళ్లు, శుభకార్యాలకు బంగారాన్ని వినియోగించడం సంప్రదాయంలో భాగం కావడంతో దీనికి డిమాండ్ అధికంగా ఉంటుంది.
నేటి ధరలు ఇవీ...
ఈరోజు బంగారం ధరలు దేశంలో పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. అయితే స్వల్పంగానే ధరలు పెరగడం ఒకింత ఊరట అని చెప్పుకోవాలి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధర పై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,610 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,750 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 77,300 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News