Gold Prices Today : పసిడి కొనుగోలు చేయాలనుకున్న వారికి నిరాశ తప్పదా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా అదే బాటలో కొనసాగుతున్నాయి.
పసిడి పరుగులు తీస్తుంది. ఇక ఆగడం అనేది జరగదేమోనన్న ఆందోళన కొనుగోలుదారుల్లో వ్యక్తమవుతుంది. బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని ముందుగా ఊహించిందే. ఇప్పటికిప్పుడు షాకింగ్ న్యూస్ అయితే కాదు.. అయితే వరసగా ధరలు పెరుగుతూ కొనుగోలుదారులను కొనాలా? వద్దా? అన్న మీమాంసలో పడేస్తున్నాయి. కొనుగోలు చేద్దామంటే రానున్న కాలంలో తగ్గుతుందేమోనని ఆశ .. లేదు మరింత పెరుగుతాయన్న హెచ్చరికలు మరోవైపు బంగారం ఊరిస్తున్నా చూస్తూ ఉండిపోతున్నారు.
ప్రతిరోజూ మార్పులు..
పసిడి ధరలలో అనేక కారణాలతో రోజు మార్పులు జరుగుతుంటాయి. మొన్నటి వరకూ పది గ్రాములపై పది రూపాయలు తగ్గి ఊరించిన పసిడి అమాంతం పెరుగుతూ ఆందోళనకు గురి చేస్తుంది. నిన్న పది గ్రాముల బంగారం ధరపై ఐదు వందల రూపాయలు పెరిగింది. వెండి ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్ కూడా ముగుస్తున్న సమయంలో ధరలు పెరుగుతుండటమేంటన్న ప్రశ్న తలెత్తుతుంది. అయితే దిగుమతులు తగ్గడమే కాకుండా, బంగారం నిల్వలు కూడా తగ్గడంతోనే బంగారం ధరలు పెరిగాయంటున్నారు.
ధరలు ఇవీ...
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా అదే బాటలో కొనసాగుతున్నాయి. పసిడి పైపైకి చూస్తుండటంతో కొనుగోలు చేయాలనుకున్న వారు వెనక్కు తగ్గే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 64,140 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 69,970 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 84,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.