Gold Prices : మళ్లీ షాకిచ్చిన గోల్డ్ రేట్స్.. ఈరోజు ఎంత పెరిగాయంటే?

ఈరోజు బంగారం ధరలు దేశంలో పెరిగాయి. వెండి ధరలు కూడా బంగారంతో పాటే పరుగులు తీస్తున్నాయి

Update: 2024-01-30 01:50 GMT

బంగారం ధరలు మళ్లీ మరింత ప్రియమయ్యాయి. తగ్గాయని సంతోషించే లోగానే పసిడిప్రియులకు షాక్ ఇచ్చేలా బంగారం ధరలు పరుగులు పెట్టాయి. అయితే స్వల్పంగా పెరిగాయని కొంత ఊరట కల్గిస్తున్నా బడ్జెట్ కు ముందు ఇది సంకేతమనే భావన వ్యక్తమవుతుంది. కేంద్ర బడ్జెట్ తర్వాత బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. అందుకే బంగారాన్ని కొనుగోలు చేసే వారు ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని, తర్వాత ధరలు మరింత పెరిగే అవకాశముందని బిజినెస్ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.

అనేక కారణాలు...
అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి మారకం విలువ వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. ఇజ్రాయిల్ - హమాస్ యుద్ధం కావచ్చు.. రష్యా - ఉక్రెయిన్ యుద్దం కావచ్చు వాటి ప్రభావం కూడా బంగారం ధరలపై చూపుతుందని చెబుతుంటారు. అందుకే బంగారాన్ని తగ్గినప్పుడే కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింత పెరిగే అవకాశమూ లేకపోలేదు.
వెండి కూడా...
ఈరోజు బంగారం ధరలు దేశంలో పెరిగాయి. వెండి ధరలు కూడా బంగారంతో పాటే పరుగులు తీస్తున్నాయి. పది గ్రాముల బంగారం ధరపై వంద రూపాయలు పెరిగితే, కిలో వెండి ధరపై రెండు వందల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,800 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,050 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 77,000 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News