Gold Prices Today : మళ్లీ షాకిచ్చిన గోల్డ్ ధరలు.. వెండి ధరలు మాత్రం?
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి
బంగారం ధరల పెరుగుదల ఎప్పుడూ ఆగడం లేదు. నిన్న కొంత తగ్గిన బంగారం ధర మళ్లీ తన పరుగును ప్రారంభించింది. పరుగు ఆపిందని భావిస్తే పొరపాటే అవుతుంది. బంగారానికి ఉన్న డిమాండ్ అలాంటిది. అంతర్జాతీయ ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, దిగుమతులను తగ్గించడం వంటి కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఆగమన్నా ఆగడం లేదు. పరుగులు తీస్తూనే ఉన్నాయి.
సీజన్ ముగియనుండటంతో...
పెళ్లిళ్ల సీజన్ మరో మూడు రోజుల్లో ముగియనుంది. మూడు నెలల పాటు ఎలాంటి శుభకార్యాలు ఉండవు. అంటే బంగారం కొనుగోళ్లు కూడా పెద్దగా ఉండవన్న అంచనాలు వినపడుతున్నాయి. అందుకే ఈ నెల 28వ తేదీ తర్వాత కొంత బంగారం, వెండి ధరలు తగ్గుతాయని అందరూ భావిస్తున్నారు. కానీ మార్కెట్ నిపుణుల అంచనా మాత్రం వేరే విధంగా ఉంది. బంగారానికి సీజన్ అంటూ ఏమీ ఉండదని, ధరలు తగ్గడం అంటూ ఉండదని, ఒకసారి పెరిగిన ధర తగ్గడమంటూ జరగదని చెబుతున్నారు.
వెండి తగ్గి...
డిమాండ్ కు తగినన్ని బంగారం, వెండి నిల్వలు లేకపోవడం వల్లనే బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. వాటి ధరల్లో రోజూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66.610 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,660 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర కొంత తగ్గి 86,300 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.