Gold Prices : బడ్జెట్ తర్వాత బంగారం ధరలు పెరగడానికి ఇవి సంకేతాలేగా?

దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. స్వల్పంగానే పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.

Update: 2024-02-02 01:50 GMT

బడ్జెట్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇటు పన్నులు పెంచలేదు. అలాగని తగ్గించలేదు. కస్టమ్స్ సుంకం విషయంలోనూ, ఎగుమతులు, దిగుమతుల సుంకం విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఎటువంటి మార్పు లేదు. దీంతో బంగారం ధరలు మళ్లీ మరొకసారి పెరిగాయి. అయితే బడ్జెట్ తో భారీగా ధరలు పెరుగుతాయని భావించినప్పటికీ ఎలాంటి మార్పులు లేకపోవడంతో స్వల్పంగానే ధరలు పెరగడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట అని చెప్పుకోవాలి.

ధరలు ఎప్పుడూ...
బంగారం ధరలు ఎప్పుడూ పరుగులు పెడుతూనే ఉంటాయి. వాటిని నియంత్రించడం కష్టం. అందులోనూ పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోళ్లు ఎక్కువగా ఉండి డిమాండ్ కూడా అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రభావం బంగారం పై పడుతుందని అందరూ అంచనా వేశారు. దానికి అనుగుణంగానే ఈరోజు బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. రానున్న కాలంలో ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
స్వల్పంగానే అయినా...
దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. స్వల్పంగానే పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై 150 రూపాయలు మాత్రమే పెరిగినా.. భవిష‌్యత్ లో ధరలు పెరగడానికి ఇది సూచిక అని అంటున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 58,150 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,440 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 77,800 రూపాయలుగా నమోదయింది.



Tags:    

Similar News