Gold Prices : క్రిస్మస్ రోజు పసందైన కబురు.. ఒక క్యూ కట్టేయండి

ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరగలేదు. స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఇది బంగారం ప్రియులకు ఊరటగానే చెప్పాలి

Update: 2023-12-25 03:52 GMT

Gold prices

బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతుంటాయి. తగ్గడమనేది అరుదుగా జరుగుతుంటుంది. కొనుగోళ్లు తగ్గినా... పెరిగినా.. పసిడి ధరలు మాత్రం ఎప్పుుడూ ప్రియంగానే ఉంటాయి. రోజురోజుకూ అందనంత దూరంలో ధరలు ఎగబాకుతూ ఉంటాయి. అయినా తమ అవసరాల నిమిత్తం, శుభ కార్యాల కోసం బంగారాన్ని కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. అందుకే పసిడికి ఎప్పుడూ దక్షిణ భారతంలో డిమాండ్ తగ్గకపోవడంతోనే జ్యుయలరీ దుకాణాలు కూడా ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తుంటాయి.

తగ్గని డిమాండ్...
బంగారంతో పాటు వెండికి కూడా అంతే డిమాండ్ ఉంటుంది. వెండిని కూడా బంగారం తరహలోనే స్టేటస్ సింబల్ గా భావిస్తుండటంతో ధనిక ప్రజల నుంచి ఎగువ మధ్య తరగతి ప్రజల వరకూ బంగారం, వెండి కొనుగోళ్లపైనే ఎక్కువ దృష్టి పెడతారు. అంతేకాదు వీటి ధరలు పెరుగుతూ ఉండటం వల్ల పెట్టుబడిగానూ భావించి మరికొందరు కొనుగోలు చేస్తుంటారు. బంగారం, వెండి వస్తువులు కష్టసమయాల్లో ఆదుకునే వస్తువులుగా కూడా భావించడంతో వీటికి గిరాకి ఎప్పుడూ పడిపోదు.
స్థిరంగా కొనసాగుతున్న...
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరగలేదు. స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఇది బంగారం ప్రియులకు ఊరటగానే చెప్పాలి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 58,200 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,490 రూపాయలుగా నమోదయింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు స్థిరంగా కొనసాగడం కొనుగోలుదారులకు శుభవార్త వంటిదే. కిలో వెండి ధర 80,500 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News