Gold Prices : భారీగా పెరిగిన బంగారం ధరలు... పెళ్లిళ్ల సీజన్ వచ్చే సరికి

బంగారం ధరలు కొనుగోలుదారులకు షాకిచ్చాయి. తగ్గిందని సంతోషపడేలోగా భారీగా పెరిగి పెళ్లిళ్ల సీజన్ లో ఆందోళనకు గురి చేశాయి

Update: 2023-12-05 03:17 GMT

బంగారం ధరలు మళ్లీ కొనుగోలుదారులకు షాకిచ్చాయి. ఒకసారి తగ్గిందని సంతోషపడేలోగా భారీగా పెరిగి పెళ్లిళ్ల సీజన్ లో ఆందోళనకు గురి చేశాయి. బంగారం ధరలకు పెరగడమే తప్ప తగ్గడం తెలియదన్న సామెత మరోసారి రుజువయింది. పసిడి ఇప్పుడు అందరి ఇంట్లో విలాస వస్తువుగా మారిపోయింది. ఎంత బంగారం ఉంటే అంత గౌరవం సమాజం నుంచి లభిస్తుందన్న కారణంతో ఎక్కువ మంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఎక్కువగా...
గోల్డ్ బాండ్స్ కంటే దక్షిణాది రాష్ట్రాలలో బంగారు ఆభరణాల విక్రయాలే ఎక్కువగా జరుగుతుండటం దీనికి కారణం. ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు కూడా అందుకు అనుగుణంగానే ఉండటంతో బంగారం కొనుగోళ్లు నిత్యం జరుగుతూనే ఉంటాయి. జ్యుయలరీ షాపులు ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉంటాయి. కొత్త కొత్త డిజైన్లు... ఊరించే ఆఫర్లతో జ్యుయలరీ దుకాణాల యాజమానులు పసిడి ప్రియులకు వల వేస్తుంటారు. అందులో పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడికి మరింత డిమాండ్ పెరిగింది.
వెండి ధరలు మాత్రం...
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై నాలుగు వందల రూపాయలు పెరిగింది. వెండి ధరలు మాత్రం నిలకడగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 58,850 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 64,200 రూపాయలుగా నమోదయింది. అంటే అరవై ఐదు వేలకు చేరువగా ధరలు ఉన్నాయి. కిలో వెండి ధర 83,500 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News