Gold Prices Today : బంగారాన్ని కొనేయాలనుకుంటున్నారా? ఈరోజు కన్నా మించిన రోజు ఉండదు మరి
దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి
పసిడి అంటేనే మక్కువ ఉండనిది ఎవరికి? ఈరోజుల్లో బంగారం అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? పసిడి ధరలు ఎప్పుడూ పైపైకి ఎగబాకుతుంటాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతుంటాయి. బంగారం అంటేనే అంత. స్టేటస్ సింబల్ గా మారడంతో పాటు భద్రతకు అడ్రస్ గా మారడంతో బంగారాన్ని సొంతం చేసుకునేందుకు అనేక మంది ఇప్పటికీ తహతహలాడుతుంటారు. బంగారం ధరలతో సంబంధం లేకుండా కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకుని మరీ కొనుగోలు చేస్తుంటారు.
రానున్న రోజుల్లో...
బంగారం ధరలకు రెక్కలు రావడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, దిగుమతులు తగ్గడం వంటి కారణాలతో బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. బంగారం, వెండి ధరలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముంది. ఆగస్టు నెల నుంచి ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నేడు స్థిరంగా...
దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి ధరపై వందరూపాయలు పెరిగింది. అయితే ఈ ధరలు ఇలాగే కొనసాగేందుకు అవకాశాలు లేవన్నది మార్కెట్ నిపుణుల అంచనాగా వినిపిస్తుంది. స్థిరంగా ఉన్నప్పుడే బంగారం, వెండి కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,240 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,270 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 94,800 రూపాయలకు చేరింది.