Gold Prices Today : అత్యవసరమైతే తప్ప బంగారాన్ని కొనుగోలు చేసే రోజులు పోయాయా?
తాజాగా ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై రెండు వందల రూపాయలు తగ్గింది.
పసిడి కొనాలంటే అంత సులువు కాదు. ఎంతో అవసరముంటే తప్ప కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పుట్టినరోజులకు...చిన్నపాటి కార్యక్రమాలకు బంగారం వస్తువులను గిఫ్ట్‌గా ఇచ్చే రోజులు ఎప్పుడో వెళ్లిపోయాయి. కేవలం పెద్ద పెద్ద శుభకార్యాలకు అంటే పెళ్లిళ్ల వంటి వారికే తప్పనిసరి స్థితిలో బంగారాన్ని చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. బంగారం ధరలు ఎక్కువగా ఉండటంతో దానిని కొనుగోలు చేయడం కంటే వేరే చోట మదుపు చేయడం మంచిదని భావించడమే ఇందుకు కారణం.
పెట్టుబడి పెట్టేవారు...
పసిడి ధరలకు రెక్కలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఎప్పుడూ అది అందనంత దూరంలో ఎగురుతూనే ఉంటుంది. ధరలను చూసి కొనుగోలు చేయాల్సి రావడంతో ఎక్కువ మంది జ్యుయలరీ దుకాణాల వైపు చూసేందుకు కూడా జంకుతున్నారు. అదే సొమ్ము భూమి మీద పెడితే తమకు రిటర్న్స్ మరింత ఎక్కువగా వస్తాయని పెట్టుబడిగా భావించే వారు కూడా అనుకుంటున్నందున బంగారు విక్రయాలు తగ్గుతున్నాయి. అదే సమయంలో ధరలు కూడా పెరుగుతున్నాయి.
తగ్గిన ధరలు ఇలా...
అయితే తాజాగా ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై రెండు వందల రూపాయలు తగ్గింది. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధరపై రెండు వందలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,800 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,050 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర ప్రస్తుతం మార్కెట్ లో 77,800 రూపాయలుగా ఉంది.