Gold Rates Today : తగ్గుతున్నాయని సంతోషించాలా? ఇంత తగ్గిందని బాధపడాలా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు కాస్త తగ్గాయి. వెండి ధరలు కూడా అంతే తగ్గుముఖం పట్టాయి

Update: 2024-02-12 02:56 GMT

బంగారం ధరలు ఎప్పుడూ ప్రియంగానే ఉంటాయి. అనేక కారణాలను చెప్పి ధరలను పెంచుతూ వెళుతుంటారు. ధరలు పెరుగుతున్నా బంగారం కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. బంగారం అంటే కేవలం ఆభరణమే కాదు... సమాజంలో తమకిచ్చే గౌరవంగా భావిస్తుండటంతోనే మహిళలు ఎక్కువగా బంగారాన్ని ఇష్టపడుతూ, కష్టపడైనా కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో ఇంట్లో జరిగే ప్రతి వేడుకకు బంగారానికి చోటు ఉంటుంది. అది సంప్రదాయంలో ఒక భాగమయింది.

ధరలు పెరుగుతాయని భావించినా....
పైగా మూడు నెలల పాటు పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో బంగారం ధరలను ఇక ఆపడం ఎవరి తరమూ కాదు. ఎందుకంటే బంగారం లేకుండా పెళ్లిళ్లు జరగవు. అది ఈ వేడుకలో ముఖ్యమైన వస్తువు కావడంతో బంగారం, వెండి వస్తువులకు ఈ మూడు నెలలు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అందుకే బంగారం ధరలు మరింత ప్రియమవుతాయన్న మార్కెట్ నిపుణుల అంచనాలు నిజమవుతాయని కూడా చెబుతారు. కానీ గత రెండు రోజుల నుంచి బంగారం ధరల్లో పెద్దగా మార్పు లేదు. స్వల్పంగానే తగ్గుతుంది.
నేటి ధరలు ఇలా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు కాస్త తగ్గాయి. వెండి ధరలు కూడా అంతే తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల బంగారంపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు మాత్రమే తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,690 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,490 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 76,400 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News