Gold Prices Today : పసిడి ధరలు ఎన్నడూ పెరగనంత స్థాయిలో.. వెండి కూడా లక్ష దాటి?

దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి

Update: 2024-07-18 03:51 GMT

పసిడి ధరలు పరుగు ప్రారంభించాయంటే ఇక ఆగేది ఉండదు. పెరిగితే భారీగా, తగ్గితే స్వల్పంగా ధరలు వినియోగదారులకు ఎప్పటికప్పుడు షాకిస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, దిగుమతులు తగ్గడం వంటి కారణాలతో బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. ఆషాఢమాసమయినా ధరలు నిలకడగానో, తగ్గుతాయనో ఎదురు చూపులు చూస్తున్న కొనుగోలు దారులకు ఎప్పటికప్పుడు ధరలు పెరుగుతూ కలవరపెడుతున్నాయి. అయినా సరే కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. జ్యుయలరీ దుకాణాలు కిటకిటలాడుతున్నాయి.

ఆఫ్ సీజన్ లో....
ప్రధానంగా పెట్టుబడి పెట్టేవారు బంగారాన్ని ఆఫ్ సీజన్ లో ఎక్కువా కొనుగోలు చేస్తుంటారు. అవసరాలు లేకపోయినా భవిష‌్యత్ లో ధరలు మరింత పెరుగుతాయని భావించి దానిని పెట్టుబడిగా భావిస్తూ కొనుగోలు చేస్తుంటారు. భవిష‌్యత్ కు భద్రత ఉంటుందని నమ్మకంతోనే బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. తమకు అవసరమైనప్పుడు వెంటనే విక్రయించుకుని దానిని సొమ్ము చేసుకునేందుకు వీలుగా పసిడిని సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉంటారు. ఇక ఆగస్టు నెల నుంచి అసలు సీజన్ ప్రారంభం కానుంది. దీంతో బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
భారీగా పెరిగి...
దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై 890 రూపాయలు పెరిగింది. వెండి ధర కూడా కిలోపై వెయ్యి రూపాయలు పెరిగింది. రానున్న కాలంలో ఈ ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 68,760 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 75,010 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర లక్షకు చేరుకుంది. ప్రస్తుతం కిలో వెండి ధర 1,00,600 రూపాయలుగా ఉంది.



Tags:    

Similar News