Gold Price Today : మళ్లీ పరుగు ప్రారంభించిన పసిడి.. ఆగుతుందా? లేదా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా కొద్దిగా పెరిగాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు

Update: 2024-07-03 02:53 GMT

దేశంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు సాధారణమే. ప్రతిరోజూ ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. అనేక కారణాలతో బంగారం, వెండి ధరల్లో ఏరోజు కారోజు మార్పులు జరుగుతాయి. అయితే ఆషాఢమాసం వస్తుండటంతో బంగారానికి పెద్దగా డిమాండ్ ఉండదని అందరూ భావించారు. ఎందుకంటే ఆషాఢ మాసంలో బంగారాన్ని కొనుగోలు చేయరని, ఆగస్టు నెల నుంచే మళ్లీ వ్యాపారాలు పుంజుకుంటాయని జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు. అయితే అది ఒకప్పుడు అని, ఇప్పుడు సమయంతో పనిలేదని, ఆషాఢం వంటి వాటిని చూడకుండా కూడా కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్నారని వ్యాపారులు చెబుతున్నారు.

ఆఫ్ సీజన్ అంటూ...
బంగారానికి ఆఫ్ సీజన్ అంటూ ఏమీ లేకుండా పోయింది. ఇక శుభకార్యాల సమయంలో ఒక పట్టాన ధరలు అందకుండా పెరుగుతూనే ఉంటాయి. మిగిలిన రోజుల్లో స్వల్పంగా పెరగడమో, తగ్గడమో చేస్తాయి. మహిళలు ఎక్కువగా ఇష్టపడే బంగారాన్ని, వెండిని కొనుగోలు చేయడానికి సీజన్ ను, ముహూర్తాలను చూడటం లేదు. ఇంట్లో పుట్టిన రోజుకు కూడా బంగారాన్ని కొనుగోలు చేయడం హాబీగా మారింది. అందుకే బంగారం దుకాణాలన్నీ ఎప్పుడూ వినియోగదారులు కిటకిటలాడుతూనే ఉంటాయి. అయితే ఆఫ్ సీజన్ లో మాత్రం వినియోగదారులను ఆకట్టుకునేందుకు బంగారు వ్యాపారులు కొన్ని ఆఫర్లు ప్రకటిస్తూ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.
స్వల్పంగా పెరిగి...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా కొద్దిగా పెరిగాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయల ధర పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. అయితే ఈ ధరలు మళ్లీ మధ్యాహ్నానికి మారే అవకాశం లేకపోలేదు. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,360 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,390 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 95,600 రూపాయలుగా కొనసాగుతుంది.


Tags:    

Similar News