Gold Prices Today : మళ్లీ పెరిగిన బంగారం ధరలు... బంగారం కొనుగోలు చేేసేవారికి?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగాయి

Update: 2024-06-29 03:42 GMT

పసిడి ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా దిగి వస్తున్నాయి. వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. అన్ సీజన్ కావడంతో ధరలు తగ్గాయని అనుకోవడానికి వీలు లేదు. అలాగని పెరగవని గ్యారంటీ కూడా లేదు. అందుకే బంగారాన్ని కొనుగోలు చేద్దాం లే అని వెయిట్ చేయడం కంటే ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. బంగారంపై పెట్టుబడి ఎప్పటికీ నష్టం రాదు. ఎందుకంటే బంగారానికి ఎప్పటికీ డిమాండ్ తగ్గదు. పసిడిని సొంతం చేసుకోవడానికి జనరేషన్ లు మారినా తపన తగ్గదు. తరాలు మారినా బంగారంపై మక్కువ మాత్రం తగ్గే అవకాశం లేనందున ధరలు పడిపోతాయన్న బెంగ అవసరం లేదని అంటున్నారు.

వారం రోజుల్లో తగ్గి...
ఎందుకంటే కేవలం మహిళలే కాదు.. పురుషులు కూడా బంగారం, వెండి పట్ల మక్కువ చూపుతుంటారు. భవిష్యత్ కు భద్రతను కల్పించేది బంగారంగా భావించడంతోనే ధరలు ఎప్పడూ పెరుగుతుంటాయి తప్ప తగ్గడం చాలా తక్కువ సార్లు జరుగుతుంటాయి. గత వారం రోజుల్లో మాత్రం దాదాపు పదిహేను వందల రూపాయల వరకూ బంగారం పది గ్రాములపై తగ్గింది. అందుకే జ్యుయలరీ దుకాణాలు కూడా కొన్ని రోజుల నుంచి వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. దుకాణ యజమానులు కూడా మంచి ఆఫర్లు కూడా ప్రకటిస్తుండటంతో గోల్డ్ షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి.
స్వల్పంగా పెరిగి...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. బంగారం, వెండి ధరలు స్వల్పంగానే పెరగడంతో ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,160 రూపాయలుగా నమోదయిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,170 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 94,400 రూపాయలగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News