Gold Prices Today : మళ్లీ దూసుకెళుతున్న పసిడి.. ఎక్కడికి వెళుతుందో ఏమో?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా అంతే స్థాయిలో పెరిగాయి.

Update: 2024-06-07 03:47 GMT

పసిడి అంటే మక్కువ చూపని వారు ఉండరు. బంగారం అంటే ఇష్టపడని వారు అతికొద్ది మందే ఉంటారు. వందలో పది మంది మాత్రమే అలాంటి వారుంటారు. పుత్తడిని తమ సొంతం చేసుకుంటే చాలు తమ జీవితం ధన్యమయినట్లేనని భావించే వారు అధికంగా ఉంటారు. ఎందుకంటే దానికున్న డిమాండ్ అటువంటిది. సమాజంలో గౌరవానికి గౌరవం.. జీవితంలో భరోసానిచ్చే బంగారం తమ వద్ద ఎంత ఎక్కువుగా ఉంటే అంత మంచిదని భావించే రోజులు వచ్చాయి. అందుకే కొనుగోళ్లుకూడా విపరీతంగా పెరిగాయి.

హాబీగా మార్చుకుని...
గతంలో బంగారాన్ని, వెండిని కొనుగోలు చేయాలంటే ఆలోచించేవాళ్లు. అప్పుడు దానిని భద్రపర్చుకోవడం కూడా పెద్ద సమస్య. కానీ ఇప్పుడు అదేం భయంలేదు. బంగారంపై పెట్టుబడి పెడితే మంచి లాభాలను చవి చూడవచ్చని రుచి చూసిన వారంతా అటువైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో సీజన్ కాకపోయినా కొనుగోళ్లు పెరుగుతున్నాయి. అందుకే రానున్న రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేసి దాచుకోవడం హాబీగా మార్చుకున్నారు.
నేటి ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా అంతే స్థాయిలో పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67,310 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,470 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 98,100 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News