Gold Prices Today : బంగారం ధరలు పరుగు ప్రారంభించాయి.. ఆపడం అసాధ్యమేమో?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా కొంత పెరిగాయి
బంగారం ధరలు నిన్నటి వరకూ ఊరించాయి. కొంత తగ్గుతూ నిదానంగా కనిపించాయి. దీంతో కొనుగోలుదారులు మరింత తగ్గుతుందని భావించారు. బంగారం, వెండి ధరలకు ఎప్పటికీ డిమాండ్ తగ్గదు. దానికున్న ప్రత్యేకతలు వేరు. రెండు వస్తువులతో భారతీయులతో బంధం అధికం. ఎందుకంటే సంప్రదాయాల ప్రకారం చూసినా, దాని విలువను బట్టి చూసినా బంగారం, వెండి తమ సొంతం చేసుకోవాలని అందరూ భావిస్తుంటారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా కొనుగోళ్లకు క్యూ కడుతుంటారు.
అలవాటుగా మార్చుకుని...
అయితే ధరలు అనేక కారణాలతో పెరుగుతుంటాయి. సీజన్ తో సంబంధం లేకుండా జరిగే ఒకే ఒక బిజినెస్ గోల్డ్ మాత్రమే. అందుకే జ్యుయలరీ దుకాణలన్నీ ఎప్పుడూ కిటకిటలాడుతుంటాయి. కుటుంబంలో జరిగే ప్రతి చిన్న కార్యక్రమానికి బంగారం, వెండిని జోడించడం అలవాటుగా మార్చుకున్నారు. అందుకే బంగారం, వెండి ధరలు తగ్గవు. కేవలం పెళ్లిళ్ల సీజన్ లోనే కొనుగోళ్లు జరగవు. అన్ని సీజన్ లోనూ బంగారానికి డిమాండ్ ఉంటుంది. అందుకే వాటి ధరలు మనకు ఎప్పుడూ అందకుండా ఉంటాయి.
నేటి ధరలు ఇలా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా కొంత పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,810 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,880 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 98,600 రూపాయలకు చేరుకుంది.