Gold Prices Today : ఇప్పుడే ఇలా ఉంటే..ఇక ఆగస్టులో పసిడిని పట్టుకోవడం సాధ్యమా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి

Update: 2024-06-21 03:16 GMT

బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. ధరలు పెరగడమంటే మామూలు విషయంగా మారింది. ఎందుకంటే ధరలు పెరగడం అనేది సాధారణ విషయంగా మారింది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతుంటాయి. ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, బంగారం దిగుమతులు తగ్గడం వంటి కారణాలతో పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా సీజన్ తో సంబంధం లేకపోయినా ధరలు పెరుగుతూ కొనుగోలు దారులకు షాక్ కు గురి చేస్తున్నాయి.

పెరుగుతున్న ధరలు...
ఇక ఇప్పుడే ఇలాగా ఉంటే.. సీజన్ ప్రారంభమయితే ధరలు ఏ రేంజ్ లో పెరుగుతాయన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది. పది గ్రాముల బంగారం ధర ఎనభై వేల రూపాయలకు చేరుకుంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం పది గ్రాముల బంగారం ధర ఎనభై వేల రూపాయలకు, కిలో వెండి ధర లక్ష రూపాయలకు చేరుకుంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి. మరో రెండు నెలల్లో మూఢమి వెళ్లిపోతుంది. ముహూర్తాలు ప్రారంభమవుతాయి. ఆగస్టు నెల నుంచి మంచి ముహూర్తాలు ఉండటంతో బంగారం, వెండి ధరల పెరుగుదలను ఇక ఆపే శక్తి ఎవరికీ ఉండదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
పెరిగిన ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ ధరలు పెరుగుతుండటం చూస్తుంటే ఇది వరసగా పెరుగదలకు సంకేతంగానే చూాడాల్సి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. బంగారం, వెండి ఇప్పుడు కొనుగోలు చేయడమే మంచిదని సూచిస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,410 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,450 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 97,200 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News