Gold Prices Today : గోల్డ్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. బంగారం ధరలు ఈరోజు ఎంత పెరిగాయంటే?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలలో కూడా అంతే స్థాయిలో పెరుగుదల కనిపించింది

Update: 2024-05-11 05:55 GMT

బంగారం అంటే అంతే మరి ఎప్పుడూ తగ్గనంటే తగ్గనంటుంది. అందుకే అది బంగారమయింది. బంగారం ధరలు తగ్గుతాయని భావిస్తే అది భ్రమే అవుతుంది. వారంలో ఒకరోజు తగ్గితే మిగిలిన ఆరు రోజులు బంగారం, వెండి ధరలు ఎంతో కొంత పెరగాల్సిందే. ఎందుకంటే వాటికున్న డిమాండ్ అలాంటిది. బంగారం, వెండి వస్తువులను శుభప్రదంగా చూడటమే కాకుండా స్టేటస్ సింబల్ గా చూడటం ప్రారంభమయిన నాటి నుంచి వాటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అందుకే ధరలు పెరుగుతున్నాయి.

కొనుగోళ్లు మాత్రం...
ప్రస్తుతం మూఢమిలో బంగారం కొనుగోళ్లు తగ్గుతాయని అనుకోవడానికి కూడా వీలులేదు. గతంలో మాదిరిగానే మూఢమిలోనూ బంగారం కొనుగోళ్లు ఉన్నాయని జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు. బంగారాన్ని కొనుగోలు చేయడం కేవలం ధరించడం కోసమే కాదు.. పొదుపు చేయడం కోసమని, పెట్టుబడిగా చాలా మంది కొనుగోలు చేస్తుండటంతో మంచి రోజులు చూడటం లేదు. సీజన్ లో ఎటూ బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి. ఇక అన్ సీజన్ అంటూ బంగారం, వెండి వస్తువులకు లేకుండా పోయింది.
స్వల్పంగా పెరిగడంతో...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలలో కూడా అంతే స్థాయిలో పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు ధర పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67,560 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,700 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 91,300 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News