Gold Prices Today : షాకిచ్చిన పసిడి ధరలు.. మళ్లీ పెరగడం ప్రారంభించిందిగా
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుదల కనిపించింది.
బంగారం ధరలు అంటే అంతే మరి. కొన్ని రోజులు తగ్గుతున్నాయంటే.. ఇక పెరుగుతున్నాయన్న సంకేతాలన్నది అందరికీ తెలిసిందే. బంగారం, వెండి వస్తువులకు పెరిగిన, పెరుగుతున్న డిమాండ్ మేరకు బంగారం, వెండి వస్తువుల ధరలు ఆటోమేటిక్ గా పెరుగుతుంటాయి. అందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు మార్కెట్ నిపుణులు. ఎందుకంటే బంగారం అనేది ఎప్పుడూ విలువైన వస్తువుగానే చూస్తారు. అందుకే అది అందరికీ అందుబాటులో ఉండటం అన్నది అసాధ్యమన్నది అందరూ గ్రహించాల్సి ఉంటుందంటున్నారు.
పెరిగే వస్తువు...
ఇదే సమయంలో సీజన్ తో సంబంధం లేకుండా పెరిగే ఏకైక వస్తువు బంగారం మాత్రమే. ఎప్పుడు పడితే అప్పుడు కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. డబ్బులుంటే చాలు బంగారం కొనుగోలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తారు. దీనికి తోడు బంగారం ఉంటే భద్రత ఉంటుందని భావించి ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అందుకే డిమాండ్ అధికం కావడం, బంగారం నిల్వలు తక్కువగా ఉండటం వల్ల కూడా ధరలు మరింతగా పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు.
నేటి ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుదల కనిపించింది. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఈరోజు మాత్రం స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 65,860 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,850 రూపాయలు పలుకుతుంది. కిలో వెండి ధర 94,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.