Gold Prices Today : బంగారం ధరల వెంట మనం పరుగులు తీయాల్సిందే.. అది మన కోసం ఆగట్లేదుగా
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా అదే మాదిరిగా పరుగులు తీస్తున్నాయి
బంగారం మళ్లీ పరుగు ప్రారంభించింది. గత కొద్ది రోజులుగా ధరలు పెరుగుతూ వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. ఇటీవల కొద్దిరోజులు పాటు తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. మొన్న పది గ్రాముల బంగారంపై నూట యాభై రూపాయలు పెరిగింది. నిన్న మూడు వందల రూపాయలు పెరిగింది. నేడు కూడా ధరలు పెరిగినా స్వల్పంగానే పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఉదయం ధరలకు, మధ్యాహ్నానికి పొంతన ఉండటం లేదు. ధరలు తగ్గాయని జ్యుయలరీ దుకాణానికి వెళ్లే లోపు ధరలు పెరిగి నిరాశను నింపుతున్నాయి.
అందుబాటులో లేక...
బంగారం ధరలు ఎప్పుుడూ అంతే. తగ్గినట్లే తగ్గి అలా ఊరిస్తుంటాయి. అంతే తప్ప ఎప్పుడు ధరలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండదు. దాని వెంట మనం పరుగులు తీయాల్సిందే తప్ప .. బంగారం మనకోసం ఆగదన్నది అందరూ తెలుసుకోవాల్సిన నిజం. బంగారం, వెండి ఆభరణాలకున్న డిమాండ్ ప్రకారం ధరలు ఎప్పుడూ అలాగే ఉంటాయి. ఎందుకంటే సీజన్ తో సంబంధం లేకుండా కొనుగోలు చేయడంతో పాటు డిమాండ్ కు తగినట్లు నిల్వలు లేకపోవడం వల్ల ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఈరోజు ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా అదే మాదిరిగా పరుగులు తీస్తున్నాయి. బంగారం, వెండి ధరలకు కళ్లెం పడే అవకాశం ఇప్పట్లో లేదన్నది మార్కెట్ నిపుణుల అంచనాగా వినిపిస్తుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,160 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,170 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 95,900 రూపాయలుగా ఉంది.