Gold Prices Today : ఇక మూడు నెలలు కొనడం కష్టమేనట.. బీ అలర్ట్

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి

Update: 2024-02-08 04:09 GMT

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. మాఘమాసం ప్రారంభం కానుండటంతో ఇక బంగారం ధరలు పెరగడమే కాని తగ్గడమనేది ఉండకపోవచ్చు. ఇది మార్కెట్ నిపుణుల మాట. అంతర్జాతీయ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారాణాలతో పసిడి ధరలు మరింత పెరగనున్నాయి.. విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంద్యం కూడా బంగారం ధరలు పెరగడానికి కారణంగా చెబుతున్నారు. బడ్జెట్ తర్వాత ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

పెళ్లిళ్ల సీజన్...
ఇక మరో మూడు రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతుంది. మూడు నెలల పాటు పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోళ్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందుకే డిమాండ్ ఎక్కువయి ధరలు కూడా భారీగా పెరిగే అవకాశముందన్న హెచ్చరికలు నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. మూడు నెలల పాటు బంగారం ధరలు పెరిగితే మాత్రం ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే పది గ్రాముల బంగారం డెబ్భయి వేలకు చేరుకునే అవకాశముందన్న అంచనాలు వినపడుతున్నాయి. 5
భారీగా తగ్గిన....
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై వంద రూపాయలు తగ్గగా, కిలో వెండి ధర పై వెయ్యి రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 58,010 రూపాయలకు చేరుకుంది. 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,240 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర వెయ్యి రూపాయలు తగ్గి ప్రస్తుతం 75,000 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News