Gold Prices Today : చూశారుగా.. అనుకున్నదే అయింది ఇంత భారీగా పెరిగితే ఎలా?
తాాజాగా దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి
బంగారం ధరలు అంతే.. స్వల్పంగా తగ్గి రారమ్మంటూ ఊరిస్తుంటాయి. తీరా దుకాణాలకు చేరుకునేలోగా ధరలు పెరిగి నిరాశకు గురి చేస్తుంటాయి. ఉదయం ఉండే ధరలు మధ్యాహ్నానికి మారుతుంటాయి. బంగారం, వెండి ధరల్లో వచ్చిన మార్పులు బహుశ ఏ వస్తువులోనూ ఇంత త్వరగా ఉండవు. ప్రతి రోజులో రెండు సార్లు ధరలలో మార్పులు జరుగుతుండటం ఒక బంగారం విషయంలోనే మనం చూస్తాం. ఉదయం బంగారం తగ్గింది కదా? అని షాపుకు వెళితే అప్పటికే అక్కడ ధర పెరిగిందంటూ బోర్డు కనిపిస్తుంటుంది. అలా ఉంటుంది బంగారం ధరల ప్రయాణం.
వెండి కూడా...
బంగారమే కాదు.. వెండి ధరలు కూడా ఇటీవల కాలంలో పరుగులు తీస్తున్నాయి. కాసేపు పరుగు ఆపినా అది అలసట తీర్చుకోవడానికే అనుకోవాలి. అలసట తీర్చుకుని మళ్లీ పరుగు ప్రారంభించడం బంగారం, వెండి వస్తువులకు అలవాటే. అంతర్జాతీయ ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్డుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటి కారణాలతో బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు చేసుకుంటాయి. వీటి ధరలు మరింత పెరుగుతాయని, ఈ ఏడాది బంగారం పది గ్రాములు ఎనభై వేలకు చేరుకోవడం గ్యారంటీ అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
భారీగా పెరుగుదల...
తాాజాగా దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రెండు వందల యాభై రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై పదిహేను వందల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,660 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం దర 72,720 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 97,500 రూపాయలుగా ఉంది.