Gold Prices Today : మొదటి వారంలో ఊరిస్తాయి.. మళ్లీ పెరగవని గ్యారంటీ ఉందా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా. వెండి ధరలు కూడా అంతే స్థాయిలో తగ్గాయి
బంగారం అంటే స్టేటస్ సింబల్ గా మారింది. ఎంతగా అంటే ఎంత బంగారం ఒంటి మీద ఉంటే అంత గౌరవం దక్కుతుంది. కుటుంబంలోనే కాదు.. చుట్టుపక్కల వాళ్ల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు బంగారాన్ని దిగేసుకుని వెళ్లడం ఒక ఫ్యాషన్ గా మారింది. ఉన్నత స్థాయి వర్గాలు బంగారాన్ని తక్కువగా ఆభరణాలు ధరిస్తూ ఎక్కువగా పేద, మధ్యతరగతి ప్రజలు మాత్రం బంగారు ఆభరణాలతో ప్రదర్శన చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మహిళలు అత్యంత ఇష్టపడే బంగారం ధరలు ఎప్పుడూ ప్రియంగానే ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. మొదటి వారంలో కొంత బంగారం తగ్గడం కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికే. డబ్బులుంటాయని మొదటి వారంలో సహజంగా తగ్గుతాయని చెబుతున్నారు.
వెండి ధరలు కూడా...
బంగారంతో పాటు వెండి ధరలు కూడా అదే స్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి. అందుకు కారణం బంగారం, వెండి అనేది శుభప్రదంగా భావించి ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. బంగారం బరువు కాదు.. భారం కాదు.. అది భరోసా అని నమ్మకం ఎక్కువ కావడంతో బంగారం ధరలు మరింత పెరుగుతున్నాయి. రానున్న రోజులలో పది గ్రాముల బంగారం ధర ఎనభై వేల రూపాయలకు చేరుకున్నా ఆశ్చర్యం లేదని మార్కెట్ నిపుణుల అంచనాలు నిజమయ్యేటట్లే కనిపిస్తున్నాయి.
తగ్గినా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా. వెండి ధరలు కూడా అంతే స్థాయిలో తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. అలా అని ఈరోజు మధ్యాహ్నానికి పెరగదన్న గ్యారంటీ ఏమీ లేదు. ఉదయం ఆరు గంటల వరకూ ఉన్న ధరలు మాత్రమే ఇవి. సాయంత్రానికి ధరలు పెరిగే అవకాశాలను కొట్టిపారేయలేం. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,490 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,540 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 93,400 రూపాయలుగా ఉంది.