Gold Prices Today : స్వల్పంగా తగ్గింది కానీ.. ముందు ముందు మాత్రం ధరలు అదిరిపోతాయటగా
దేశంలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొంచెం తగ్గి పరవాలేదనిపించాయి.
పసిడి ప్రియులకు ఎప్పడూ షాక్ ల మీద షాక్ లు తగులుతూనే ఉంటాయి. బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. వెండి ధరలు కూడా దానికి తోడు పరుగులు పెడుతూనే ఉంటాయి. బంగారం, వెండి అనే వస్తువులు రెండింటికి తెలిసింది పెరగడమే తప్ప తగ్గడం అస్సలు తెలియదు. అయినా ఈ రెండు వస్తువులకు మాత్రం గిరాకీ ఏ మాత్రం తగ్గదు. ఎందుకంటే.. బంగారం, వెండి వస్తువులను తమ ఇంట శుభాలను తెచ్చే అపురూపమైన వాటిగా అందరూ భావించినందువల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది.
పెరుగుతూనే...
బంగారం, వెండి ధరలు గత నాలుగు రోజుల నుంచి పెరుగుతూనే ఉన్నాయి. అయితే ధరలను పెరగడం చూసి కొనుగోలు చేయడం ఎవరైనా మానుకున్నారా? అంటే అది లేదు. ఎందుకంటే రోజురోజుకూ వాటి డిమాండ్ పెరుగుతూనే ఉంది. స్టేటస్ సింబల్ గా చూడటం ప్రారంభమయిన నాటి నుంచి ఆ వస్తువులను కొనుగోలు చేయడం మరింత ఎక్కువగా మారింది. అంతర్జాతీయంగా ధరలలో కనిపిస్తున్న ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం కూడా ధరల పెరుగుదలకు ఒక కారణంగా చెబుతున్నారు.
నేటి ధరలు...
అయితే గత కొద్ది రోజులు నుంచి బంగారం, వెండి ధరలు పెరుగుతుండటంతో పసిిడి పది గ్రాములు ఎనభై వేల రూపాయలకు చేరుకోవడానికి ఎంతో దూరం లేదన్న అంచనాలు వినిపించాయి. కానీ దేశంలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొంచెం తగ్గి పరవాలేదనిపించాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 కారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,140 రూపాయలు గా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,150 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధరల మాత్రం 95,100 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.